భగవద్గీత-విశిష్టత
భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా గర్వించ దగిన ఆధ్యాత్మిక గ్రంథం. భగవద్గీత గురించి పూర్తిగా తెలిసిన వాళ్లు తక్కువ. కేవలం దైవ సంబంధ గ్రంథంగా భావించి పూజా మందిరానికి పరిమితం చేసే వాళ్లే ఎక్కువ. నిజానికి భగవద్గీత యుద్ధభూమిలో విజయునికి చెప్పిన విషయాలు: ప్రతి వ్యక్తి జీవితంలో జరిగిన ఘటనలు, ఆత్మవిశ్వాసం కోల్పోయే పరిస్థితులు, మానసిక సంఘర్షనలు ఉండక తప్పదు. అటువంటి సందర్భాల్లో ‘గీత’ తమను ఓదార్చిందని చాలా మంది చెప్పారు. భగవద్గీత మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు. చదివితే అందులో మానసిక శారీరక వ్యవస్థలను ఎలా అదుపులో ఉంచుకోవాలో మానవజీవన గతిలో అనుసరించవలసిన సూత్రాలు, విధానం వివరించటం గమనించవచ్చు. మనకు అనేకానేక సందేహాలు వస్తుంటాయి. యోగి ఎవరు? ధర్మం ఏమిటి? హింస అంటే? పాపమంటే? పుణ్యమంటే? ఇటువంటి సందేహాలకు చక్కని సమాధానం మనకు భగవద్గీతలో లభిస్తుంది. ఆధ్యాత్మిక పరంగా కూడ భగవంతుడు, భక్తి, సృష్టి, ఆరాధన, దేవుని గొప్పతనం, వంటి ఎంతో సరళంగా వివరించింది గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారాంశం: ఉపనిషత్తులు వేదాంతం. కావున ప్రాచీన కాలంలో ఆధ్యాత్మికత అంతా ప్రకృతి ఆరాధన నుంచే ప్రారంభమైందని గమనించవచ్చు. నాడు...