భగవద్గీత
ప్రపంచవ్యాప్తంగా గర్వించ దగిన ఆధ్యాత్మిక గ్రంథం. భగవద్గీత గురించి
పూర్తిగా తెలిసిన వాళ్లు తక్కువ. కేవలం దైవ సంబంధ గ్రంథంగా భావించి పూజా
మందిరానికి పరిమితం చేసే వాళ్లే ఎక్కువ. నిజానికి భగవద్గీత యుద్ధభూమిలో
విజయునికి చెప్పిన విషయాలు: ప్రతి వ్యక్తి జీవితంలో జరిగిన ఘటనలు,
ఆత్మవిశ్వాసం కోల్పోయే పరిస్థితులు, మానసిక సంఘర్షనలు ఉండక తప్పదు. అటువంటి
సందర్భాల్లో ‘గీత’ తమను ఓదార్చిందని చాలా మంది చెప్పారు. భగవద్గీత మొత్తం
పద్దెనిమిది అధ్యాయాలు. చదివితే అందులో మానసిక శారీరక వ్యవస్థలను ఎలా
అదుపులో ఉంచుకోవాలో మానవజీవన గతిలో అనుసరించవలసిన సూత్రాలు, విధానం
వివరించటం గమనించవచ్చు. మనకు అనేకానేక సందేహాలు వస్తుంటాయి. యోగి ఎవరు?
ధర్మం ఏమిటి? హింస అంటే? పాపమంటే? పుణ్యమంటే? ఇటువంటి సందేహాలకు చక్కని
సమాధానం మనకు భగవద్గీతలో లభిస్తుంది. ఆధ్యాత్మిక పరంగా కూడ భగవంతుడు,
భక్తి, సృష్టి, ఆరాధన, దేవుని గొప్పతనం, వంటి ఎంతో సరళంగా వివరించింది గీత.
భగవద్గీత ఉపనిషత్తుల సారాంశం: ఉపనిషత్తులు వేదాంతం. కావున ప్రాచీన
కాలంలో ఆధ్యాత్మికత అంతా ప్రకృతి ఆరాధన నుంచే ప్రారంభమైందని గమనించవచ్చు.
నాడు విజ్ఞానమంటే ఆధ్యాత్మిక జ్ఞానమే, ప్రకృతిని ప్రేమించిన మానవుడే, తోటి
జీవులను ప్రేమిస్తాడని తొలి భావన ఆనాడు ఉండేది. యజ్ఞం, ప్రార్థన విస్తరించి
ఆధ్యాత్మిక భావనలో క్రియా యోగంగా అవతరించాయి. అందుకే గీతలో అన్ని
అధ్యాయాలకు ‘యోగా’ అని ఉంటుంది. యోగా అంటే భగవంతునితో భక్తుని సంయోగం
(విలీనం) అనే అర్థం మొదట్లో ఉండేది. సృష్టికి కారణమైన తాను బలవంతుడని
చెప్పాడు, అట్లని మానవులు ఏ కష్టం లేకుండా కేవలం తననే నమ్ముకుంటే ప్రయోజనం
లేదని కూడా హెచ్చరించాడు. నమ్మకమే మనిషిని ఉన్నతుడిని చేస్తుందని పరిపూర్ణ
విశ్వాసం లేని పూజ వల్ల ప్రయోజనం లేదంటుంది. అంతేనా ‘స్వధర్మ’ నిర్వహణ కూడా
ఆధారణలో భాగమనే విశిష్ట లక్షణం. వివరించటమే ప్రపంచ ఆధ్యాత్మిక గ్రంథాల్లో
‘గీత’కు గల గొప్ప సుగుణం అంతేనా; ‘కర్మ’ చేయటంలో దైవారాధన ఉనికి
గుర్తించమని చెబుతూనే ‘నిష్కామ కర్మ’ వల్లే మోక్షం లభిస్తుందని చాటుతుంది
గీత. ఇంకో విషయమేమిటంటే ‘గీత’ మానసిక ఆరాధనకు, ధైవచింతన భక్తిభావన
ఎంతముఖ్యమంటుందో శారీరక ఆరోగ్య విషయములో ఆహార నియమాలు ఎలా పాటించాలో ఆయా
ఆహార గుణాలే మనిషిలోని ప్రవర్తనలకు ఎలా హేతువులౌతాయో వివరిస్తుంది. అంటే ఏక
కాలంలో మానసిక, శారీరక వ్యవస్థకు, హితోపదేశం చేయటం ‘గీత’కు గల మరో విశిష్ట
లక్షణం. భగవద్గీత వలన అమూల్యమైన విషయాలు ఎన్నో తెలుస్తాయి.
ధర్మమే
జయిస్తుందని, జననమరణాలు సహజమని, శోకం మనిషికి మంచిది కాదని, ఈ ప్రపంచంలో
ఎవరూ శాశ్వతం కారని, ఉన్నంతలో నలుగురికి మంచి చేయాలని చెబుతుంది. భగవద్గీత
నిత్యపారాయణ గ్రంథం మాత్రమే కాదు, నిత్య జీవన సూక్తి ముక్తావళి కూడా. ఒక
గీతను క్షుణ్ణంగా పఠిస్తే, సర్వశాస్త్ర పఠనంతో సమానమంటారు. భగవత్స్వరూప
తత్త్వ జ్ఞాన పరంపర గీత ద్వారా మనకు పూర్తిగా తెలుస్తుంది. కారణం ఇందులో
భగవంతుని అపరాపరావూపకృతుల వివరణ ఉంది. సృష్టి భూతముల, ఉత్పత్తి వంటి గొప్ప
విషయాలు ఉన్నాయి. ‘అనన్య భక్తి’ గురించి చర్చించి, మహాభక్తుల జీవితాలు ఎలా
ధన్యమయ్యాయో వర్ణిస్తుంది. భక్తులు, భక్తి ఆరాధనా ప్రాముఖ్యత వివరిస్తుంది.
దైవాసురసంపద్విభాగయోగం,
అధ్యాయంలోనైతే మానవుల స్వభావం, కామక్షికోధాలవంటి అంతరంగ శత్రువుల పట్ల
అప్రమత్తత వివరణ కనిపిస్తుంది. కర్మ, జ్ఞాన, యోగాలు ఒక్కటే కాదు, కేవలం
అజ్ఞాని కూడా భక్తి యోగం ద్వారా భగవంతుని అనుక్షిగహం పొందవచ్చని గీత
అభయమిస్తుంది. ఇంత గొప్ప గ్రంథం కాబట్టే, ఇది దైవవాణిగా గమనించి
అర్చిస్తారు. అనంతమై భావాలసంపుటి కేవలం చెబుతూ వెళ్లే గ్రంథం కాదు. చర్చలు
సాగిస్తూ అయోమయ ప్రశ్నలకు సమాధానం చెబుతూ, ముందుకు సాగుతూ తన వెంట మనలను
తీసుకు వెళ్తుంది ‘గీత’ భగవద్గీత తత్వమసి అనే విశిష్ట భావ లక్షణాలని సమస్త
ప్రాణుల్ని దైవం ఉన్నాడనే దృక్పథాన్ని వివరిస్తుంది. ‘వాసుదేవసర్వమితి’ అనే
భావన మనలో నెలకొల్పుతుంది. తృష్ణ, మోహం వంటివి వదిలి, నిరాడంబర జీవితంలోని
భక్తి కూడా ఆదరణీయమైన అమూల్యాభివూపాయం గీతలో కన్పిస్తుంది.
సద్గుణ,
నిర్గుణ ఉపాసన తాత్విక చింతన ప్రబోధిస్తుంది. జ్ఞాన, కర్మ, భక్తి భావాలందు
ఏ ఒక్కటి గొప్ప కాదని తనను ఏ మార్గంలోనైనా చేరవచ్చుననే సమతాభావం గీత
వర్ణిస్తుంది. ఈ విధంగా విశ్వవ్యాప్తమై విశిష్టక్షిగంతమై వెలిగిన భగవద్గీత
అత్యున్నత ఆద్యాత్మిక గ్రంథంగా భావించి అందరం గౌరవించాలి. గీతాసారం అర్థం
చేసుకొని జీవిస్తే వారి జీవితం ఆనందతుల్యమై ప్రశాంతంగా గడుస్తుందని
భావించాలి.. అదే గీతకు గల విశిష్ట లక్షణం కూడా.
- డా॥ బి. దామోదరరావు
944096279
944096279
No comments:
Post a Comment